తిరుపతి ముచ్చట్లు:
- సుమారు 72 మంది ఫిర్యాదుదారుల సమస్యలపై తక్షణ స్పందన.
- సంబంధిత అధికారులకు త్వరిత పరిష్కారానికి స్పష్టమైన ఆదేశాలు.
- తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పి.జి.ఆర్.ఎస్ (Public Grievance Redressal System) కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఫిర్యాదుదారుల సమస్యలకు తక్షణ తీసుకువాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
- ఈ సందర్భంగా సుమారు 72 మంది ఫిర్యాదుదారుల నుంచి వివిధ అంశాలకు సంబంధించిన వినతులు స్వీకరించబడ్డాయి. అందిన ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులకు వెంటనే పంపించి, వాటిని ప్రాధాన్యతతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.
- ఫిర్యాదుదారులకు త్వరిత న్యాయం అందించడమే పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
- ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవి మనోహర్ ఆచారి (శాంతి భద్రతలు) పాల్గొన్నారు.
Tags: District SP Receives Complaints at PGRS.