May 4, 2026
Explore
ఉద్యోగుల బకాయిలు తక్షణమే విడుదల చేయాలి

ఉద్యోగుల బకాయిలు తక్షణమే విడుదల చేయాలి

May 4, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి అన్నారు. సోమవారం విశ్రాంత ఉద్యోగుల సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మరణించిన విశ్రాంత ఉద్యోగి సోమశేఖర్‌కు నివాళులర్పించారు. వార్షిక వేదికను కోశాధికారి సుబ్రమణ్యం చదివి వినిపించారు. చెంగారెడ్డి మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులందరు ప్రతి నెల సమావేశాలకు తప్పకుండ హాజరుకావాలెనని కోరారు.

Tags: Employees’ arrears must be released immediately.