ఏర్పాట్లను పరిశీలించిన సీఐ సుబ్బరాయుడు
పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని చెరువుకట్టపై ఉన్న హజరత్ సయ్యద్ నూర్‌షావలి బాబా దర్గా వారి ఉరుసు కార్యక్రమం ఈనెల 7వ తేదీన ప్రారంభమై నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో కమిటి సభ్యులు ఉరుసు జరిగే కళాశాల మైదానాన్ని పరిశీలించారు. ఉరుసు సందర్భంగా వేలాది మంది రానుండటంతో తొక్కిసలాట జరగకుండ ట్రాఫిక్, బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఉరుసు 7, 8, 9, 10 తేదీలలో జరుగుతుందని 7న గంధంతో ప్రారంభమై, ఖవ్వాలి పాటలపోటీలు నిర్వహిస్తారన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.

Tags: Hazrat Syed Noor Shah Wali Dargah Urs on the 7th.