May 4, 2026
Explore
అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు!

అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు!

May 4, 2026 | Andhra Pradesh

వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు తొలి ప్రాధాన్యం..

బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యం..

పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలు.

మదనపల్లి లో పోలీసు ప్రధాన కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం.’

మదనపల్లి ముచ్చట్లు:

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీల పట్ల అత్యంత బాధ్యతగా వ్యవహరించాలి. బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పోలీసు అధికారులు పనిచేయాలి” అని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు. సోమవారం మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులతో ఎస్పీ ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందించి, నిర్ణీత గడువులోపు సత్వరమే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. చట్టపరిధిలో వారికి సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. జిల్లా కేంద్రానికి రాలేని దూరప్రాంతాల ప్రజలు తమ ఫిర్యాదుల కోసం వ్యయప్రయాసలకోర్చి ఇక్కడికే రావాల్సిన అవసరం లేదని ఎస్పీ సూచించారు. బాధితులు తమ పరిధిలోని స్థానిక పోలీసు స్టేషన్లు, సర్కిల్ లేదా సబ్ డివిజన్ పోలీసు కార్యాలయాల్లో సైతం నేరుగా తమ అర్జీలను నిర్భయంగా సమర్పించవచ్చని, అక్కడ కూడా సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.

Tags:Do not be negligent in resolving petitions!