పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని కుమ్మరవీధిలో గల మఖాన్ వద్ద 200 మంది పిల్లలకు ఖత్నా కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. నౌజవాన్ ఆధ్వర్యంలో ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం మగపిల్లలకు ఖత్నా చేసే కార్యక్రమం సంప్రదాయంగా నిర్వహించారు. పుంగనూరు పరిసర ప్రాంతాల నుంచి పిల్లలు, వారి తల్లిదండ్రులు రావడంతో మఖాన్ ప్రాంతం క్రిక్కిరిసిపోయింది. పిల్లలకు ఖత్నా చేసి వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడకుండ పౌష్ఠికాహారాన్ని పంపిణీ చేశారు.
Tags: Circumcision Ceremony for 200 Muslim Children