పుంగనూరుముచ్చట్లు:
రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం పటాలమ్మ ఆలయంలో పూజలు చేసి ఆలయాన్ని ప్రారంభించారు. మండలంలోని చిన్నకొండచెర్ల లో గ్రామస్తులు కలసి సుమారు రూ.40 లక్షలతో పటాలమ్మ ఆలయాన్ని రాతితో నూతనంగా ఆలయాన్ని నిర్మించారు. మూడు రోజుల పాటు వేదపండితులచే హ్గమాలు, పూజలు చేశారు. గ్రామంలోని మహిళలందరు కలసి కలిశాలను తీసుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్దిరెడ్డి హాజరుకాగానే వేదపండితులు, గ్రామస్తులు కలసి పూర్ణకుంభస్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులతో పలు విషయలపై చర్చించారు. అలాగే వైఎస్సార్‌సిపి నాయకులు జయచంద్రారెడ్డి నిర్మించిన నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పెద్దిరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి రెడ్డెప్ప, బోయకొండ మాజీ చైర్మన్ నాగరాజారెడ్డి, జిల్లా యూత్‌వింగ్ కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డి, ఎంపిటిసి నంజుండప్ప, నాయకులు శంకరప్ప, రెడ్డెప్ప, సుబ్రమణ్యంరెడ్డి, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.



Tags: Patalamma Temple Inaugurated by Former Minister Peddireddy