May 3, 2026
Explore
అలంపూర్ డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం

అలంపూర్ డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం

May 3, 2026 | Andhra Pradesh

– జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

అలంపూర్ ముచ్చట్లు:

  • 🔰 అలంపూర్ చౌరస్తా వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయంలో ప్రతి సోమవారం ఆర్డీఓ స్థాయిలో ప్రజావాణి
  • 🔷 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి
  • అలంపూర్ చౌరస్తా వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయంలో ప్రతి సోమవారం ఆర్డీఓ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
  • సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి ఉంటుందని, అన్ని శాఖలకు చెందిన డివిజన్ స్థాయి అధికారు లందరూ అందుబాటులో ఉంటారని వివరించారు.
  • ఈ కార్యక్రమం సజావుగా నిర్వహణ కోసం అలంపూర్ డిప్యూటీ తహసీల్దార్ వేణుగోపాల్ రెడ్డి మరియు ఉండవెల్లి డిప్యూటీ తహసీల్దార్ జి. వెంకట రమణలను పర్యవేక్షణ అధికారులుగా నియమించినట్లు తెలిపారు.
  • ప్రజల ఫిర్యాదులను సిజిజి ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేసి,అంగీకార పత్రం ఇవ్వడం మరియు సంబంధిత శాఖలకు పంపించే ప్రక్రియను వీరు పర్యవేక్షిస్తారని తెలిపారు.
  • సంబంధిత డిప్యూటీ తహసీల్దార్లు తమ మండలాల నుంచి కంప్యూటర్ ఆపరేటర్లను నియమించి వివరాలు వెంటనే తెలియజేయాలని సూచించారు.
  • అలంపూర్, ఉండవెల్లి తహసీల్దార్లు కార్యక్రమం కోసం కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇంటర్నెట్, స్టేషనరీతో పాటు ప్రజలకు నీడ, కూర్చునే సౌకర్యం మరియు తాగునీరు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
  • జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తమ విభాగాలకు చెందిన డివిజన్ స్థాయి అధికారులను తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరు చేయాలని,వారు ప్రజల ఫిర్యాదులను స్వీకరించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
  • ప్రతి ఫిర్యాదుపై చర్యల నివేదికలు, మధ్యంతర సమాధానాలు మరియు తుది నివేదికలను గరిష్టంగా 30 రోజుల లోపు పోర్టల్‌లో నమోదు చేయడం తప్పనిసరి అని ఆదేశించారు.

Tags: ‘Prajavani’ Program at the Alampur Divisional Level