అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదివారం అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని ప్రజలతో మమేకం కానున్నారు.
మంత్రి గారు తెల్లవారుజామున కడపకు చేరుకుని అనంతరం రాయచోటి పర్యటనకు బయలుదేరనున్నారు. ఉదయం 10.30 గంటలకు రాయచోటి రింగ్ రోడ్ సమీపంలోని వారిగా రోడ్డుకు చేరుకుని శ్రీ దేవకి యశోద కృష్ణ ఆలయ నిర్మాణానికి రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మరియు జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు.
తదుపరి మధ్యాహ్నం రాయచోటి పాతపల్లి రింగ్ రోడ్‌లోని లక్ష్మీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో నిర్వహించే కమ్యూనిటీ సమావేశంలో పాల్గొననున్నారు.
అనంతరం మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 4.00 గంటల వరకు రాయచోటి రూరల్ పరిధిలోని అబ్బవరం లేఅవుట్‌లో లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి, ప్రజా సభలో పాల్గొననున్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై మంత్రి సమీక్షించి, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.
Tags:Tour Details of the Minister for Civil Relations, Sri Kolusu Parthasarathy: