హిందూపురం ముచ్చట్లు:
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ..
ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు..
సీసీ కెమెరాల సహాయంతో నిందితులను గుర్తింపు..
సంఘటన జరిగిన 10 గంటల లోపే చాకచక్యంగా కేసు చేదింపు..
పోలీసులు బాగా స్పందించారు బాధితురాలు రాజేశ్వరమ్మ..
పోలీస్ అధికారులు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన బాధితురాలు..
ఈ కేసు వేగవంతంగా చేదించిన పోలీస్ అధికారులు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ ..
హిందూపురం పట్టణంలో ఇటీవల జరిగిన రాబరీ కేసును పోలీసులు చాకచక్యంగా కేవలం 10 గంటల వ్యవధిలోనే ఛేదించి, ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, దోపిడీకి గురైన బంగారు వస్తువులు నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు వివరాలను ఆదివారం హిందూపురం డి.ఎస్.పి కె.వి మహేష్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో
సి ఐ లు జనార్ధన్, ఆంజనేయులు, కరీం లతో కలిసి మీడియాకు వెల్లడించారు..
ఈ కేసును జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, IPS గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి, హిందూపురం డిఎస్పీ కే.వి. మహేష్ పర్యవేక్షణలో దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీ కెమెరాల సహాయంతో నిందితులను గుర్తించడం జరిగింది.
సంఘటన వివరాలు:
01-05-2026 ఉదయం సుమారు 7:50 గంటల సమయంలో, హిందూపురం పట్టణానికి చెందిన శ్రీమతి ఎం. రాజేశ్వరమ్మ (63 సంవత్సరాలు) గారు ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సు కోసం వేచి ఉండగా, పెనుకొండకు వెళ్తున్నట్లు చెప్పిన డీజిల్ ఆటోలో ఎక్కారు.
ఆ ఆటోలో ముందుగానే పథకం ప్రకారం ఉన్న నిందితులు కొంత దూరం వెళ్లిన తర్వాత, కత్తితో బెదిరించి ఆమె వద్ద ఉన్న బంగారు నగలు మరియు నగదును దోచుకుని, కొట్నూరు గ్రామం దాటి బైలు ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో వదిలివేసి పరారయ్యారు.
దోపిడీకి గురైన వస్తువులు..
సుమారు 83 గ్రాముల బంగారం
నగదు రూ. 50,000/-
మొత్తం విలువ సుమారు రూ. 8,70,000/-
కేసు వివరాలు:
కేసు నం.: Cr.No. 66/2026
సెక్షన్లు: 309(4), 127(2) r/w 3(5) BNS
పోలీస్ స్టేషన్: హిందూపురం I టౌన్ PS
అరెస్ట్ వివరాలు:
03-05-2026 ఉదయం Super-B స్పిన్నింగ్ మిల్స్ వద్ద వాహనాల తనిఖీల సమయంలో నిందితులను అదుపులోకి తీసుకుని, జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.
అరెస్ట్ చేసిన నిందితులు:
జబిపాషా (43 సంవత్సరాలు)
రషీదా (31 సంవత్సరాలు)
ఒక జువైనల్ బాలుడు (13 సంవత్సరాలు)
సీజ్ చేసిన వస్తువులు:
నేరానికి ఉపయోగించిన డీజిల్ ఆటో
కత్తి
బంగారు మాంగల్యం చైన్ – 3.50 గ్రాములు
బంగారు చైన్ (డాలర్‌తో) – 11.40 గ్రాములు
రెండు బంగారు ఉంగరాలు – 4.90 గ్రాములు
బంగారు కమ్మీలు & మాటీలు – 11.50 గ్రాములు
నగదు రూ. 37,000/-
పోలీసుల వేగవంతమైన చర్య:
సంఘటన జరిగిన వెంటనే బాధితురాలు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి, హిందూపురం మరియు పెనుకొండ పోలీసుల సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టి, సీసీ కెమెరాల సహాయంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ, ఈ సంఘటన జరిగిన వెంటనే బాధితురాలు ఫిర్యాదుతో జిల్లా ఎస్పీ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు పెనుగొండ హిందూపురం పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. సీసీ కెమెరాల సహకారంతో ఈ కేసును 10 గంటల లోపాయి చేదించి నిందితులను పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ సంఘటనలో పోలీసులు ఎలాంటి చిన్న నిర్లక్ష్యం కూడా లేకుండా బాధితురాలకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.ప్రజలు తమ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాలను వేగంగా ఛేదించవచ్చని తెలిపారు.
బాధితురాలి స్పందన:
“సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాను. వారు వెంటనే స్పందించి, నా పోగొట్టుకున్న బంగారు నగలు, నగదును తిరిగి ఇచ్చారు. పోలీసులకు నా కృతజ్ఞతలు,” అని బాధితురాలు రాజేశ్వరమ్మ తెలిపారు.
అభినందనలు:
ఈ కేసును వేగంగా ఛేదించిన హిందూపురం పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ అభినందించారు.ఈ ఆపరేషన్‌లో హిందూపురం రూరల్ సి.ఐ జనార్ధన్, 2 టౌన్ సి.ఐ అబ్దుల్ కరీం, ఎస్.ఐలు మరియు ఇతర సిబ్బంది కీలక పాత్ర పోషించారు.
ప్రజలకు విజ్ఞప్తి:
అపరిచిత వాహనాల్లో ప్రయాణించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ సూచించారు.
Tags: Robbery Case Solved in Hindupur Town – Three Accused Arrested…