కురబలకోట ముచ్చట్లు:
కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని మిట్స్ యూనివర్సిటీలో నేడు నీట్ (NEET) ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కళాశాల వీసీ యువరాజ్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ తదితర వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఈ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. మొత్తం 1400 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
Tags; NEET Exam Today in Kurabalakota