May 2, 2026
Explore
ముదివేడు టోల్ ప్లాజా వద్ద ప్రమాదం… జంటకు గాయాలు

ముదివేడు టోల్ ప్లాజా వద్ద ప్రమాదం… జంటకు గాయాలు

May 2, 2026 | Andhra Pradesh

ముదివేడు ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కురబలకోట మండలం ముదివేడు టోల్ ప్లాజా సమీపంలో బైక్‌పై ప్రయాణిస్తున్న జంట ప్రమాదానికి గురైంది. రాయచోటికి చెందిన యువతి, బెంగళూరుకు చెందిన యువకుడు ఈ ఘటనలో స్వల్ప గాయాలు పొందారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి వారిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు చికిత్స పొందుతూ కోలుకుంటున్నట్లు సమాచారం. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

Tags: Accident at Mudivedu Toll Plaza… Couple Injured