August 1, 2026
Explore
రాజంపేట మున్సిపల్ సాధారణ సమావేశంలో అభివృద్ధి అంశాలపై చర్చ

రాజంపేట మున్సిపల్ సాధారణ సమావేశంలో అభివృద్ధి అంశాలపై చర్చ

August 1, 2026 | Andhra Pradesh

రాజంపేట ముచ్చట్లు:

రాజంపేట మున్సిపల్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మున్సిపల్ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో పట్టణ అభివృద్ధి, ప్రజలకు అందుతున్న మౌలిక సదుపాయాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాలు, కొనసాగుతున్న అభివృద్ధి పనులు, కొత్త ప్రతిపాదనలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Discussion on development issues at Rajampet Municipal General Meeting