August 1, 2026
Explore
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ..

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ..

August 1, 2026 | Andhra Pradesh

లబ్ధిదారులకు స్వయంగా అందజేసిన అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి

రాజంపేట ముచ్చట్లు:

సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం సిబ్యాల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు, పెన్షన్ లబ్ధిదారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: Distribution of NTR Bharosa pensions…