March 17, 2026
Explore
మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి

మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి

March 17, 2026 | Andhra Pradesh

భీమారం ముచ్చట్లు:

కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ)లోని ఓ హాస్టల్లో కొందరు సీనియర్లు జూనియర్పై దాడి చేసిన ఘటనలో ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థిని మృతిచెందింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకి చెందిన కృష్ణబాబు, అంజమ్మల కుమార్తె శ్రీవిద్య(20) కేయూలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ రెండో సంవత్సరం చదువుతోంది. పద్మాక్షి హాస్టల్ బి బ్లాక్ లో ఉంటోంది. అదే హాస్టల్లో ఉంటున్న సీనియర్లకు.. శ్రీవిద్యకు మధ్య ఓ విషయంలో వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో శ్రీవిద్యపై ఆరుగురు సీనియర్లు దాడి చేయడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హాస్టల్కు వచ్చి విచారణ చేపట్టి సయోధ్య కుదిర్చారు. ఈ ఘటన అనంతరం తల్లిదండ్రులు వచ్చి శ్రీవిద్యను ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం ఏపీలోని గంపలగూడెంలో తమ అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లిన శ్రీవిద్య.. ఈ నెల 7, 8 తేదీల్లో రెండుసార్లు ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించింది. సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో నిమ్స్క తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు మధిర ఠాణాలో ఫిర్యాదు చేశారు.

Tags: Student Attempts Suicide Due to Mental Distress; Dies While Undergoing Treatment