– రాజంపేట పార్లమెంట్‌లో మార్పులు?
మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య, మదనపల్లె ప్రాంతాల్లో పాత నియోజకవర్గాల పునర్విభజనపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాల విభజన చట్టం ప్రకారం 2009కి ముందు రద్దైన నియోజకవర్గాలు తిరిగి వచ్చే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇలా జరిగితే ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలకు తోడు మరో 50 నియోజకవర్గాలు చేరి మొత్తం 225కి చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లాలో లక్కిరెడ్డిపల్లి, వాయల్పాడు నియోజకవర్గాలు పునరుద్ధరించే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
పాత నియోజకవర్గాలు పునరుద్ధరించబడితే రాజంపేట పార్లమెంట్ పరిధిలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, కడప పార్లమెంట్‌లో 7 నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే మదనపల్లె జిల్లాను కొత్తగా ఏర్పాటు చేసే అవకాశాలపై కూడా చర్చ కొనసాగుతోంది.
అయితే మహిళా బిల్లు, డిలిమిటేషన్ ప్రక్రియలు నిలిచిపోవడంతో తక్షణంలో ఈ మార్పులు అమల్లోకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Tags:Speculation over the Redelimitation of Old Constituencies