August 1, 2026
Explore
తల్లిపాలే బిడ్డ సంపూర్ణ వికాసానికి పునాది

తల్లిపాలే బిడ్డ సంపూర్ణ వికాసానికి పునాది

August 1, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా బండ్లవంకలో నిర్వహించిన కార్యక్రమంలో పీలేరు మండలం తలుపుల పీహెచ్‌సీ ప్రధాన వైద్యాధికారులు డా. శ్రీగిరీష, డా. చంద్రశేఖర్ నాయక్ మాట్లాడుతూ ప్రసవించిన అరగంటలోపు ఇచ్చే ముర్రుపాలు శిశువుకు అమృతంతో సమానమని తెలిపారు.

తొలి ఆరు నెలలు తల్లిపాలే సంపూర్ణ ఆహారమని, ఇవి శిశువును న్యూమోనియా, అతిసారం వంటి వ్యాధుల నుంచి రక్షించడంతో పాటు మేధస్సు, మానసిక వికాసానికి దోహదపడతాయని వివరించారు. ప్రతి శిశువుకు తల్లిపాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags; Breast milk is the foundation for a child’s holistic development.