August 1, 2026
Explore
పరారీలో ఉన్న ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్.. 14 రోజుల రిమాండ్

పరారీలో ఉన్న ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్.. 14 రోజుల రిమాండ్

August 1, 2026 | Andhra Pradesh

చిట్వేల్ ముచ్చట్లు:

చిట్వేల్ పోలీసులు 2024 నుంచి పరారీలో ఉన్న ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. రూరల్ సీఐ డి. శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం, రైల్వే కోడూరు మండలం వెంకటేశ్వరపురం ఎస్టీ కాలనీకి చెందిన కొండారెడ్డి వినోద్ కుమార్ కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్- బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ప్రత్యేక గాలింపులో నిందితుడిని పట్టుకుని తిరుపతి ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. పెండింగ్ వారెంట్ల అమలుపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

Tags: Absconding red sandalwood smuggler arrested; remanded for 14 days.