– సమస్యల పరిష్కారానికి హామీ
చిన్నమండలం ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా చిన్నమండలం బోరెడ్డిగారి పల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన నివాసంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. గ్రామ ప్రజలు తమ సమస్యలను నేరుగా మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడం తన బాధ్యత అని తెలిపారు. భూసంబంధిత అంశాలు, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలపై వచ్చిన వినతులను పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కారం అందించే దిశగా చర్యలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
Tags: Minister’s Public Grievance Meeting in Borededigari Palle