-మార్చి 3న హైకోర్టులో హాజరైన రేంజర్
- హైకోర్టుకు తప్పుడు నివేదికలు
- హైకోర్టులో అనుచిత ప్రవర్తన
పుంగనూరుముచ్చట్లు:
ఓ క్వారీ లైసెన్సు, భూముల కేటాయింపు విషయంలో హైకోర్టుకు 18 పేజిల నివేదికలను తారుమారు చేసి, మార్చి 3వ తేదీన హైకోర్టులో నేరుగా హాజరై అనుచితంగా, క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తించిన పుంగనూరు ఫారెస్ట్ రేంజర్ శ్రీరాములును సస్పెండ్ చేస్తూ అటవీశాఖ ప్రిన్సిపల్ కన్సర్‌వేటర్ డాక్టర్ పివి.చలపతిరావు ఉత్తర్వులు జారీ చేసిన సంఘటన శుక్రవారం సాయంత్రం వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు మండలం పాలెంపల్లెకి చెందిన ఓక్వారీ యజమాని లైసెన్సు, క్వారీ భూముల దురాక్రమణతో క్వారీ నిర్వహణలపై రాష్ట్ర హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి అటవీశాఖ కౌంటర్ దాఖలు చేసింది. ఈ నివేదికల్లో 3 నుంచి 18 పేజిల నివేదికలు తారుమారు చేసి కోర్టును తప్పుదావ పట్టించేరానే , దీని వలన అటవీశాఖకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని హైకోర్టు విచారణలో వెల్లడైంది. దీనిపై హైకోర్టు మార్చి 3వ తేదీన అటవీశాఖ అధికారులు హైకోర్టులో హాజరుకావాలెనని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు పుంగనూరు రేంజర్ శ్రీరాములు కూడ మార్చి 3న హైకోర్టులో హాజరైయ్యారు. విచారణ సందర్భంగా రేంజర్ క్రమశిక్షణ రహితంగా న్యాయమూర్తి ఎదుట ప్రవర్తించడం, ఆహంకార పూరితంగా మాట్లాడటం, తప్పుడు నివేదికలు కోర్టుకు సమర్పించడంతో పాటు అదే నివేదికలను రెండు సార్లు మార్చి సమర్పించడంపై హైకోర్టు ఫారెస్ట్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి రేంజర్ అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణ చర్యలపై బిఎఫ్‌వో నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఈ నివేదికలను పరిశీలించిన ప్రభుత్వం రేంజర్ శ్రీరాములును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే సస్పెన్షన్ కాలంలో శ్రీరాములు అనుమతి లేకుండ పుంగనూరు వదిలి వెళ్లరాదని ఆదేశించారు. పుంగనూరు ఎఫ్‌ఆర్‌వోగా ఇతరులకు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాల్లో పేర్కొన్నారు.
Tags: Forest Ranger Sriramulu Suspended for Improper Conduct in High Court