May 1, 2026
Explore
క‌నుల‌విందుగా సిరుల తల్లికి స్న‌ప‌న‌తిరుమంజ‌నం

క‌నుల‌విందుగా సిరుల తల్లికి స్న‌ప‌న‌తిరుమంజ‌నం

May 1, 2026 | Andhra Pradesh

తిరుప‌తి ముచ్చట్లు:

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాల భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు శుక్రవారం తోటలో స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది.

ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు భక్తులకు కనువిందు చేశాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరింద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యల భక్తులు పాల్గొన్నారు.

Tags:A Visual Feast: The Sacred Bath Ceremony for the Mother of Wealth