March 16, 2026
Explore
వంటగ్యాస్‌ గౌడౌను తనిఖీ

వంటగ్యాస్‌ గౌడౌను తనిఖీ

March 16, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

వంటగ్యాస్‌ సరఫరాపై నిరంతర పర్యావేక్షణ కొనసాగుతోందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండ చర్యలు తీసుకుంటున్నట్లు తహశీల్ధార్‌ రాము తెలిపారు. సోమవారం పట్టణంలోని దోబికాలనీలో గల వంటగ్యాస్‌ గౌడౌనును ఆకస్మికతంగా తనిఖీ చేశారు. స్టాక్‌ రిజిస్టర్లను పరిశీలించి , గ్యాస్‌ సరఫరాలో ఏమైన సమస్యలు ఉన్నాయా..అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండ ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టిందన్నారు. వంటగ్యాస్‌ సరఫరాకు సంబంధించి ఏమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ తనిఖీలో ఆర్‌ఐ ఫనికుమార్‌ , గ్యాస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Inspection of Cooking Gas Warehouse