May 1, 2026
Explore
ధ్వజారోహణంతో న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ధ్వజారోహణంతో న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

May 1, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

     న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్ర‌వారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. రాత్రి 7.30 గంటలకు స్వామివారు పెద్ద‌శేష‌వాహనంపై విహ‌రించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

    ఇందులో భాగంగా ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య మిథున‌ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం ఘట్టాన్ని నిర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం.

      ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు.

       ఈ కార్యక్రమంలో న్యూ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షులు   సుమంత్ రెడ్డి, ఆలయ ఏఈవో   బాల‌రాజు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు   రంగనాయక్,   ఉదయ్ కుమార్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.  

Tags: Brahmotsavams of Sri Venkateswara Swamy commence in New Delhi with the Dhwajarohanam ceremony.