March 16, 2026
Explore
అగ్నిప్రమాదాలపై అప్రమత్తం

అగ్నిప్రమాదాలపై అప్రమత్తం

March 16, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

వేసవికాలంలో సంభవించే అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపకశాఖాధికారి సుబ్బరాజు తెలిపారు. సోమవారం పట్టణ సమీపంలోని భగత్‌సింగ్‌ కాలనీ వద్ద గల పెట్రోల్‌బంక్‌ నందు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలకు పెట్రోల్‌ పట్టే సమయంలో సెల్‌ఫోన్‌లో మాట్లాడరాదని సూచించారు. ఈ విషయంపై పెట్రోల్‌బంక్‌ యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఏ చిన్నపొరపాటు జరిగినా తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Alertness Regarding Fire Hazards