పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని రోటరీక్లబ్ వారు రూ.3 లక్షలు విలువ చేసే టాటా ఏసీ వాహనాన్ని మానవత స్వచ్చంధ సేవా సంస్థకు శుక్రవారం విరాళంగా ఇచ్చారు. సంస్థ ప్రతినిధులు డాక్టర్లు ప్రభాకర్, శరణ్, నానబాలగణేష్, పూలత్యాగరాజు, రాజారెడ్డి, సరస్వతమ్మ ఆధ్వర్యంలో సభ్యులందరు కలసి టాటా ఏసీవాహనాన్ని కొనుగోలు చేశారు. మానవత స్వచ్చంధ సంస్థ వారు భౌతికకాయాలను నిల్వ ఉంచేందుకు ఫ్రీజర్ బాక్సులను ఉచితంగా బాధిత కుటుంభాలకు అందజేస్తున్నారు. ఫ్రీజర్ బాక్సులను తరలించేందుకు వాహనం లేకపోవడంతో రోటరీక్లబ్ వారు వాహనాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా రోటరీక్లబ్ వారిని మానవత సంస్థ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు నారాయణరెడ్డి, నందీశ్వర్, అనిల్‌కుమార్, రామకృష్ణారెడ్డి, రామలింగారెడ్డి, హరినాథరెడ్డి, పిఎల్.ప్రవీన్, భాస్కర్‌జెట్టితో పాటు సీనియర్ న్యాయవాది మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.
Tags; Vehicle Donated to Manavatha Organization by Rotary Club