సమస్యలను పరిష్కరించాలని డీఎస్పీ పావనికి వినతి
మదనపల్లి ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ డివిజనల్ డిఎస్పి పావని ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం ఎస్సీ ,ఎస్టీ ,బీసీ ,మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎం .శంకరప్ప మాట్లాడుతూ ఎస్సీ ,ఎస్టీ ,బీసీ, మైనార్టీ ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. డీఎస్పీ కి పూలమాల , శాలవతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెంచుపల్లి కృష్ణప్ప, సీనియర్ నాయకులు ఏ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.నాగరాజు, జిల్లా కార్యదర్శి కే సుబ్రహ్మణ్యం, జిల్లా కార్యవర్గ సభ్యులు అనమప్ప, రాష్ట్ర సెక్రటరీ చీ.టీ గంగప్ప, మారెమ్మ గుడి రెడ్డప్ప, మండల అధ్యక్షుడు బి.నాగభూషణం, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
Tags: Appeal to DSP Pavani to Resolve Issues