May 1, 2026
Explore
మంగ్లీ కేసు లో ట్విస్ట్…!

మంగ్లీ కేసు లో ట్విస్ట్…!

May 1, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

సింగర్ మంగ్లీ కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని సింగర్ మంగ్లీ చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. బాధితులను చూస్తే జాలేస్తుందని, వారి తరపున ఫైట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్న మంగ్లీ.. కావాలని ఈ కేసులో తనని, తన తమ్ముడు శివ చౌహాన్‌ను ఇబ్బంది పెడుతున్నారంటూ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుని మరీ ప్రకటించారు. ఇదిలా ఉంటే, ఇప్పుడీ కేసులో అసలైన టర్నింగ్ పాయింట్‌ని పోలీసులు కనిపెట్టారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రమావత్ మధు అకౌంట్ నుంచి మంగ్లీ సోదరుడి అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ అయినట్లుగా పోలీసులు గుర్తించడంతో.. కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ అకౌంట్‌కు మూడు సార్లు భారీగా మనీ ట్రాన్స్‌ఫర్ జరిగిందని, అకౌంట్‌లో మనీ పడిన రోజే విత్‌ డ్రా చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో రమావత్ మధు అకౌంట్‌ను సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతకు ముందు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి అకౌంట్స్ వివరాలు కావాలని బ్యాంకులకు పోలీసులు లేఖ రాశారు. రమావత్ అకౌంట్ నుంచి శివ చౌహాన్ అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ జరిగినట్లుగా గుర్తించిన పోలీసులు.. ఇప్పుడు సింగర్ మంగ్లీ అకౌంట్స్‌‌ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలనే నిర్ణయం తీసుకోవడంతో.. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు మరింత ఆసక్తికరంగా మారింది.
తమ్ముడు శివ చౌహాన్ అకౌంట్‌లో జరిగిన లావాదేవీలపై సింగర్ మంగ్లీ.. ఎలా రియాక్ట్ అవుతారు? అనేది కూడా చూడాల్సి ఉంది.

ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది? వీళ్లేనా.. లేదంటే ఇంకా పెద్ద తలకాయలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులకు టర్నింగ్ పాయింట్ దొరికేసింది కాబట్టి.. త్వరలోనే ఈ కేసును వారు క్లోజ్ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో తెరపైకి ఎవరెవరి పేర్లు వస్తాయనేది? చూడాలి..

Tags: A Twist in the Mangli Case!