April 30, 2026
Explore
భారత్‌కు నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌ క్షమాపణలు

భారత్‌కు నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌ క్షమాపణలు

April 30, 2026 | Andhra Pradesh

జమ్మూకశ్మీర్‌ ముచ్చట్లు:

నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌ భారత్‌కు క్షమాపణలు చెప్పింది. జమ్మూకశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపుతూ తన నెట్‌వర్క్‌ మ్యాప్‌ను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడమే ఇందుకు కారణం. ఈ పోస్ట్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో నష్టనివారణ చర్యలకు దిగింది. భారత్‌కు క్షమాపణలు చెబుతూ మరో పోస్ట్‌ చేసింది. తన నెట్‌వర్క్‌ మ్యాప్‌లో సాంకేతిక లోపాలు ఉన్నాయని పేర్కొంది. అయితే దేశాల సరిహద్దుల విషయంలో ఈ మ్యాప్‌ నేపాల్‌, నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌ అధికారిక వైఖరిని ఇది చాటదని పేర్కొంది.

Tags: Nepal Airlines Apologizes to India