పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని శాంతినగర్ 4వ వీధిలో నివాసం ఉన్న శ్రీనివాసులు ద్విచక్రవాహనం శుక్రవారం రాత్రి చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు. ఏపి 40 డిఎఫ్8011 నెంబరు గల ద్విచక్రవాహనాన్ని ఇంటి సమీపంలో పార్కింగ్ చేయగా, గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసి తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఈఘటనతో వాహన యజమాని ఆందోళనకు గురై య్యారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:Theft of a two-wheeler