April 30, 2026
Explore
టిడ్కో గృహాలను వీడని సమస్యలు

టిడ్కో గృహాలను వీడని సమస్యలు

April 30, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణ సమీపంలోని గూడూరుపల్లె వద్ద నిర్మించిన టిడ్కో గృహాల్లో సమస్యలు విలయతాండవం చేస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గరువారం ఈ మేరకు మున్సిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. పారిశుద్ధ్యం లేకపోవడం, మంచినీటి సమస్య, బయటప్రాంతాల వారు విచ్చలవిడిగా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేస్తే తమనే బెదిరిస్తూ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags: Problems Continue to Plague TIDCO Housing