పరిటాల, పెద్దాపురం, తుర్లపాడు, జుజ్జూరులో నేతలకు తంగిరాల సౌమ్య గారు తీవ్ర హెచ్చరిక
పార్టీ నియమావళిని ఉల్లంఘించిన వారి వ్యవహారం అధిష్ఠానం దృష్టికి.. ఇకపై ఉపేక్షించేది లేదు!
నందిగామముచ్చట్లు:
తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే నేతలకు ఇకపై ఎలాంటి మినహాయింపులు ఉండవని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీమతి తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నందిగామ నియోజకవర్గంలోని పరిటాల, పెద్దాపురం, తుర్లపాడు, జుజ్జూరు గ్రామాల్లో కొందరు నేతలు పార్టీ నియమావళి, నిబంధనలను అతిక్రమించి వ్యవహరించిన అంశాలు ఇప్పటికే పార్టీ అధిష్ఠానం దృష్టికి వెళ్లాయని ఆమె వెల్లడించారు.
పార్టీ క్రమశిక్షణను ధిక్కరిస్తే ఎంతటి వారైనా చర్యలు ఎదుర్కోవాల్సిందేనని హెచ్చరించారు. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఆయా గ్రామాలకు భవిష్యత్తులో అందించే పార్టీ సహాయ సహకారాలు అందవని తేల్చిచెప్పారు.
పార్టీ జెండా కింద పదవులు, గుర్తింపు పొందుతూ పార్టీ నిర్ణయాలనే ధిక్కరించే ధోరణిని సహించేది లేదని ఆమె హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పార్టీ మరింత కఠినమైన చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు.
Tags;Disciplinary action is inevitable if the party line is crossed!