పుంగనూరుముచ్చట్లు:
కార్తీకమాస తొలి సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు శివాలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల శివనామస్మరణతో ఆలయాలు భక్తిపారవశ్యమైంది. పట్టణంలోని శ్రీ భోగనంజుండేశ్వరస్వామి, కోనేటి వద్ద గల శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి, నగిరివీధిలో గల శ్రీసోమేశ్వరస్వామి, యాబైరాళ్ల మొరవలో గల మొరవేశ్వరుడు, భీమగానిపల్లెలో గల శ్రీభీమేశ్వరస్వామి ఆలయం, నెక్కుంది కొండలపై వెలసియున్న శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా వేకువజామున ఆలయ అర్చకులు స్వామి, అమ్మవార్ల విగ్రహాలను శుద్ది చేసి, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హోమం నిర్వహించి, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీకమాసంలో భక్తులు ఈనెల రోజుల పాటు వేకువ జామున శివాలయాలకు వెళ్లడం, పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ. ప్రతి రోజు ఉసిరికాయపై నెయ్యిదీపాలు వెలిగించి, స్వామివారికి దీపారాధన చేస్తే ముక్తి లభిస్తుందని, ఆకుటుంబం సకల సంపదలతో వృద్ధి చెందుతుందని నమ్మకంతో కార్తీకమాసంలో ఉసిరికాయలకు పూర్తి డిమాండ్ పెరుగుతుంది.
Tags;Temples resounded with the chanting of Shiva’s name