పుంగనూరుముచ్చట్లు:
ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానటరింగ్ కమిటి సమావేశాలకు అధికారులు డుమ్మా కొట్టడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తహశీల్ధార్ కార్యాలయంలో ఎంపీడీవో అప్పాజి, డిప్యూటి తహశీల్ధార్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. 27 శాఖల అధికారులు రావాల్సి ఉండగా అధికారులు ఎవరు రాకపోవడంతో సమస్యలు అలాగే ఉండిపోతోందని సభ్యుడు అశోక్ మండిపడ్డారు. దీనిపై జిల్లా కలెక్టర్ తక్షణం చర్యలు తీసుకుని సమావేశాలు సజావుగా నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
Tags; Officials Skip SC/ST Committee Meetings