తిరుపతి ముచ్చట్లు:
శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాణదాన పథకం కింద 190 మంది పేద రోగులను ఉచిత శస్త్రచికిత్సల కోసం ఎంపిక చేశారు. గురువారం మధ్యాహ్నం స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో జరిగిన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్విమ్స్ డైరెక్టర్ మరియు ఉపకులపతి డా. ఆర్.వి. కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మెడికల్ సూపరింటెండెంట్ డా. రామ్, బర్డ్ హాస్పిటల్ డా. దీపక్, రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. పి. శ్రీనివాస్, మెటర్నిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రోగుల ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక స్థితి, బియ్యం కార్డు వంటి అర్హతలను పరిశీలించి ఎంపిక చేశారు.
విభాగాల వారీగా ఎంపికైన రోగుల సంఖ్య ఇలా ఉంది:
కార్డియాలజీ–2, కార్డియోథొరాసిక్–17, జనరల్ సర్జరీ–9, మెడిసిన్–15, నెఫ్రాలజీ–73, న్యూరాలజీ–6, న్యూరో సర్జరీ–40, గైనకాలజీ–6, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ–18, సర్జికల్ ఆంకాలజీ–3, యూరాలజీ–1. మొత్తం 190 మందికి ఉచిత చికిత్సలు అందించనున్నారు. ప్రాణదాన పథకం ద్వారా పేదలకు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు ఆర్థిక సహాయం అందిస్తున్న టీటీడీ యాజమాన్యానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమానికి దాతలు, సంస్థలు ముందుకు వచ్చి విరాళాలు అందించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
Tags: 190 Poor Patients Selected Under the SVIMS–TTD Pranadana Scheme