April 30, 2026
Explore
ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది కొరత

ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది కొరత

April 30, 2026 | Andhra Pradesh

ఓపిలో చర్మవ్యాదులు, కడుపునొప్పి రోగులు

పుంగనూరుముచ్చట్లు:

స్థానిక ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది కొరత రోగులను పీడిస్తోంది. గురువారం ఆసుపత్రిలో అబా యాప్‌ ద్వారా రోగుల ఆధార్‌కార్డులతో 370 మంది ఓపి నమోదు చేశారు. ఆసుపత్రిలో 22 మంది డాక్టర్లు ఉండాలి. ముగ్గురు జనరల్‌ సర్జన్లు లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. రోగులు వందల సంఖ్యలో వస్తున్న రోగులు, వారి సహాయకులు ఉండేందుకు షెడ్లు మాత్రం లేకపోవడంతో ఎండలోనే రోగులు చెట్ల క్రింద ఉండాల్సి ఉంది. ముఖ్యంగా పెద్ద ఆపరేషన్లు నిర్వహించడం లేదు. అంబులెన్స్ సేవలు అంతంతమాత్రంగా ఉంది. ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత లేకున్న వినియోగం లేదు. అలాగే ఇద్దరు హెడ్‌నర్సులను మదనపల్లె నుంచి బదిలీ చేసిన వారు బాధ్యతలు చేపట్టలేదు. మదనపల్లెలో మెడికల్‌ కళాశాల ఉన్నందున అక్కడే విధులు నిర్వహించుకునేలా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది. అలాగే ఇద్దరు స్టాప్‌ నర్సులు పోస్టులు ఖాళీగా ఉంది. ఇవి కాకుండ సిబ్బంది, సెక్యూరిటి తగినంత స్థాయిలో నియమించలేదు. పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు సక్రమంగా చెల్లించలేదని వాపోతున్నారు. ఏరియా ఆసుపత్రిపై పర్యవేక్షణ లేకపోవడంతో సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని రోగులు వాపోతున్నారు.

చికిత్సలకు కొరత లేదు….

ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగులకు చికిత్సలు జరుగుతున్న జబ్బుల నివారణ మాత్రం జరగడం లేదు. తీవ్ర ఆనారోగ్యానికి గురైన రోగులను బయట ఆసుపత్రులకు పంపుతున్నారు. సాధారణ రోగులకు మాత్రమే చికిత్సలు అందిస్తున్నారు. రోగులకు అందిస్తున్న భోజనం, తదితర ఆహారపదార్థాలలో నాణ్యత ఉండటం లేదని , ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

Tags: Shortage of Doctors and Staff at the Area Hospital