April 30, 2026
Explore
పదిలో బాలికల సవాల్‌-ఫలితాల్లో అగ్రస్థానం

పదిలో బాలికల సవాల్‌-ఫలితాల్లో అగ్రస్థానం

April 30, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పదోతరగతి ఫలితాల్లో బాలికలు అధిక మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. ఎంఈవో నటరాజరెడ్డి జెడ్పి హైస్కూల్‌లో హెచ్‌ఎం రుద్రాణి గురువారం విలేకరులకు పది ఫలితాలను వివరించారు. షహవార్‌ అనే విద్యార్థి 592 మార్కులు స్యాధించింది. అలాగే హర్షిత 584 మార్కులు, లక్ష్మీఅఖిల 580 మార్కులు సాధించారు. హైస్కూల్‌లో 35 మంది విద్యార్థులు 500 లకు పైగా మార్కులు సాధించారు. ఈ సందర్భంగా స్థానిక ఇందిరా సర్కిల్‌లో బాణసంచాలు పేల్చి బాలికను సన్మానించారు. గూడూరుపల్లె హైస్కూల్‌లో తేజశ్రీ 569, మహశ్రీ 542, తన్వికరెడ్డి 532 మార్కులు సాధించినట్లు హెచ్‌ఎం మహేష్‌నారాయణ తెలిపారు. చండ్రమాకులపల్లె హైస్కూల్‌లో సిందుప్రియ 533 మార్కులు, ధనుష్‌ 508 మార్కులు సాధించినట్లు హెచ్‌ఎం వెంకట్రమణ తెలిపారు. కొత్తయిండ్లు మున్సిపల్‌ హైస్కూల్‌లో సారిక 580 మార్కులు, హనీష్‌రెడ్డి 578 , సాక్షిత 576 మార్కులు సాధించినట్లు హెచ్‌ఎం హెచ్‌ఎం ఉష తెలిపారు. అలాగే ఎన్‌డిఆర్‌ విశ్వభారతి స్కూల్‌ లో ఎన్‌వి.ప్రణీత్‌ 597 మార్కులు సాధించి పట్టణంలో ప్రథమస్థానంలో నిలిచారు. అలాగే తిరుమలేశ 581, మౌజ్‌ 578, ప్రణీత్‌ 569 , విష్ణు 566 మార్కులు సాధించారు. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమిలో రోహిత్‌ 593, భరత్‌ 584 మార్కులు, లిఖిత 581 మార్కులు సాధించినట్లు డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. వికాస్‌ హైస్కూల్‌లో లక్ష్మీప్రసన్న 585, రాఘవేంద్ర 584 మార్కులు సాధించారు.

Tags: Girls’ Challenge in Class 10: Topping the Results