బి.కొత్తకోట ముచ్చట్లు:
బి.కొత్తకోట మండలంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. తుమ్మనగుట్టకు చెందిన రైతు ఎర్రమద్దు ఈశ్వరరెడ్డి (54) ఉదయం తన వ్యవసాయ బావి వద్ద టమోటా పంట పనుల కోసం వెళ్లాడు. ఎండ వేడిమిని తట్టుకోలేక బావిలో ఈతకు దిగగా ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Farmer Drowns While Swimming – Tragedy in B. Kothakota