July 29, 2026
Explore
ఎస్సీ,ఎస్టీలను అవమానించడమే

ఎస్సీ,ఎస్టీలను అవమానించడమే

July 29, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ఎస్సీ,ఎస్టీల విజిలెన్స్ అండ్‌ మానటరింగ్‌ కమిటి సమావేశాలకు అధికారులు రాకపోవడం ఎస్సీ, ఎస్టీలను అవమానించడమేనని సంఘ నాయకులు ధ్వజమెత్తి నిరసన తెలిపారు. బుధవారం ఎస్సీ, ఎస్టీ మాన టరింగ్‌ కమిటి సమావేశం నిర్వహించారు. అధికారులు ఎవరు రాకపోవడంతో సమావేశాన్ని తహశీల్ధార్‌ రద్దు చేశారు. ఈసందర్భంగా సభ్యులు ఎన్‌ఆర్‌.అశోక్‌, శ్రీనివాసులు ,శంకరప్ప, పెంచుపల్లె కృష్ణ ల ఆధ్వర్యంలో తహశీల్ధార్‌ కార్యాలయం ముందు నిరసన తెలిపి ఆందోళన వ్యక్తం చేశారు. అశోక్‌ మాట్లాడుతూ మూడు నెలలుగా అధికారులు రాకుండ సమావేశాలు జరుపుతున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలు పరిష్కరించకుండ కాలయాపన చేస్తూ , అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఈ పద్దతి మార్చుకుని అధికారులు అందరు సమావేశాలకు హాజరుకావాలని , లేకపోతే తీవ్ర స్థాయిలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సభ్యులు రాజా, శంకర, మణి, నారాయణ, గంగప్ప, కుమార్‌రెడ్డి, రమణ, గంగరాజు, కళావతి తదితరులు పాల్గొన్నారు.

Tags: It amounts to insulting SCs and STs.