July 29, 2026
Explore
మహిళ న్యాయవాదిపై దాడి

మహిళ న్యాయవాదిపై దాడి

July 29, 2026 | Andhra Pradesh

30న న్యాయవాదులు సమ్మె

పుంగనూరుముచ్చట్లు:

కోర్టులో మహిళ న్యాయవాదిని న్యాయమూర్తి ఎదుట దూషించిన కేసులో నిందితుడిపై కేసు నమోదు చేశారు. దీంతో రెచ్చిపోయిన నిందితుడు, వారి కుటుంబ సభ్యులు బుధవారం ఆమె ఇంటి వద్దకు వెళ్లి ఆమెపై దాడి చేసి గాయపరిచడంతో ఆమెను గ్రామస్తులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కుమ్మరగుంటలో నివాసం న్యాయవాది గాయిత్రి ఈనెల 27న కోర్టులో ఉండగా అదే గ్రామానికి చెందిన శ్రీరాములు మధ్యం మత్తులో న్యాయవాదిని దూషించడంతో గమనించిన న్యాయమూర్తి పోలీసులకు ఆదేశాలు జారీ చేసి కేసు నమోదు చేయించారు. దీనిపై ఆగ్ర హంతో నిందితుడు , వారి కుటుంబ సభ్యులు కలసి ఆమె ఇంటిపై దాడి చేసి , ఆమెను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు , గ్రామస్తులు ఆమెను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి, చికిత్సలు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే న్యాయవాదులు కలసి ఆమెను పరామర్శించారు. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

30న విధులు బహిష్కరణ….

న్యాయవాది గాయిత్రిపై దాడిని ఖండిస్తూ , సంఘీభావం ప్రకటిస్తూ గురువారం న్యాయవాదులు విధులు బహిష్కరిస్తున్నట్లు సంఘ అధ్యుక్షుడు విజయకుమార్‌ తెలిపారు. న్యాయవాదులపై దాడులు జరగకుండ చర్యలు తీసుకోవాలన్నారు. నిందితులపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేయాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు.

Tags: Attack on a female lawyer