పుంగనూరుముచ్చట్లు:
గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ దత్తక్షేత్రం, శ్రీషిరిడిసాయిబాబా ఆలయాల్లో బుధవారం ప్రత్యేక పూజలు, హ్గమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొత్తయిండ్లలో గల శ్రీసాయిబాబా ఆలయము, చెరువు కట్టపై గల సాయి, దత్త ఆలయము , యాబైరాళ్ల మొరవలో గల శ్రీదత్తక్షేత్రము , మాదనపల్లెలో గల శ్రీసాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సాయినాథున్ని ప్రత్యేకంగా అలంకరించారు. సాయినామస్మరణతో ఆలయాలలో పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.
Tags: Guru Purnima celebrations held with devotion and reverence.