రైల్వేకోడూరు ముచ్చట్లు:
రైల్వేకోడూరులో హుబ్లీ–తిరుపతి ఇంటర్‌సిటీ ప్యాసింజర్ రైలులో సంచలన ఘటన వెలుగుచూసింది. అనంతరాజుపేట సమీపంలో రైల్వే బోగీపై నిప్పులు చిమ్మినట్టు కనిపించడంతో పాటు శబ్దం రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. రైలు రైల్వేకోడూరుకు చేరుకున్న వెంటనే అధికారులు దాన్ని నిలిపివేసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ బోగీపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. మృతుడు ఎవరన్నది తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Dead Body Found on Train Coach Sparks Sensation in Railway Kodur