April 30, 2026
Explore
పైపులైన్ గొడవలో కత్తితో దాడి – ఒకరికి గాయాలు

పైపులైన్ గొడవలో కత్తితో దాడి – ఒకరికి గాయాలు

April 30, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

పెద్దమండ్యం మండలంలో పైపులైన్ వివాదం ఘర్షణకు దారి తీసింది. తురకపల్లెకు చెందిన సయ్యద్ వసీమ్ పక్కవీధికి పైపులైన్ వేయించే ప్రయత్నంలో ఉండగా, గ్రామానికి చెందిన ఇస్మాయిల్ అడ్డుకుని కొడవలితో దాడి చేశాడని బాధితుడు ఆరోపించాడు. ఈ ఘటనలో వసీమ్ గాయపడగా, స్థానికులు వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Knife Attack in Pipeline Dispute – One Injured