మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లెలో గంజాయికి బానిసైన ఇద్దరిని పోలీసులు డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. కురబలకోట మండలానికి చెందిన ఈ ఇద్దరిలో మార్పు తీసుకురావాలని డీఎస్పీ పావని నిర్ణయించారు. ఆమె ఆదేశాల మేరకు ముదివేడు ఎస్ఐ మధురామ చంద్రుడు వారిని మదనపల్లెలోని డీ-అడిక్షన్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ అందించారు. వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ చికిత్స కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Tags: De-addiction treatment for cannabis addicts in Madanapalle