April 30, 2026
Explore
సుండుపల్లి లో పెట్రోల్ బంక్‌ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ భావన

సుండుపల్లి లో పెట్రోల్ బంక్‌ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ భావన

April 30, 2026 | Andhra Pradesh

సుండుపల్లి సుండుపల్లి

సుండుపల్లి మండల కేంద్రంలోని పీలేరు రోడ్డులో ఉన్న రైతు సేవ కేంద్రం పెట్రోల్ బంక్‌ను బుధవారం రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన తనిఖీ చేశారు. పెట్రోల్, డీజిల్ నిల్వలు, స్టాక్ రికార్డులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంధన కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా కొనసాగించాలని సూచించారు. స్టాక్ వివరాలను నిరంతరం ఉన్నతాధికారులకు తెలియజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మమ్మ, డీటీ యూనిట్ కుమార్ రెడ్డి, ఆర్‌ఐ జ్యోతి, పెట్రోల్ బంక్ యజమాని దర్బార్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Tags: Sub-Collector Bhavana inspects a petrol bunk in Sundupalli.