April 30, 2026
Explore
పక్కా సమాచారంతో పాసుపుస్తకాలు పంపిణి చేయాలి: సబ్ కలెక్టర్

పక్కా సమాచారంతో పాసుపుస్తకాలు పంపిణి చేయాలి: సబ్ కలెక్టర్

April 30, 2026 | Andhra Pradesh

సుండుపల్లె ముచ్చట్లు:

సుండుపల్లెలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు భూ యాజమాన్య పాసుపుస్తకాలు పూర్తి వివరాలతో త్వరగా అందించాలని రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన రెవెన్యూ అధికారులకు సూచించారు. బుధవారం సుండుపల్లె తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో పాసుపుస్తకాల పంపిణి పురోగతిని పరిశీలించారు. ఖాతాల పూర్తి స్థితి, పెండింగ్ వివరాలు తెలుసుకుని, పాసుపుస్తకాలలో ఫోటోలు, సంతకాలు, ఫోన్ నంబర్లలో ఉన్న తప్పులను సరిచేయాలని ఆదేశించారు. భూయజమానుల వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు పూర్తి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయానికి ప్రభుత్వ భవనం నిర్మాణం కోసం అక్కంపల్లె రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నం.11లో ఉన్న 2.36 ఎకరాల స్థలాన్ని పరిశీలించి, భూమి వివరాలను ఆన్‌లైన్‌లో ధృవీకరించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Passbooks must be distributed based on accurate information: Sub-Collector