రైల్వే కోడూరు ముచ్చట్లు:
రైల్వే కోడూరు మండలంలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. మైసూరవారిపల్లి పంచాయతీ పరిధిలోని మామిడికాయల యార్డ్ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఓబనపల్లి అరుంధతి వాడకు చెందిన శివకుమార్ (26) కారులో తిరుపతి వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Road Accident in Railway Kodur – Young Man Dies