అన్నమయ్య ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో బైక్ దొంగతన కేసులో నిందితుడికి కోర్టు జైలుశిక్ష విధించింది. ములకలచెరువు, బురకాయలకోట ప్రాంతాల్లో మూడు బైకులు దొంగతనానికి గురయ్యాయి. ఈ కేసులో పుంగనూరు మండలం చండ్రమాకులపల్లెకు చెందిన వెంకటరెడ్డిని పోలీసులు గుర్తించి 2025 అక్టోబరులో అప్పటి ఎస్ఐ నరసింహుడు అరెస్టు చేశారు. కేసు విచారణలో నేరం రుజువు కావడంతో తంబళ్లపల్లె జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి బుధవారం నిందితుడికి 9 నెలల జైలుశిక్ష విధించారు.
Tags; Jail Sentence for Bike Thief