రాయచోటి ముచ్చట్లు:
రాష్ట్రవ్యాప్తంగా గురువారం పదో తరగతి ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో విద్యార్థులకు జిల్లా ఎస్పీ ధీరజ్ సూచనలు చేశారు. విజయాలు, అపజయాలు జీవితంలో సహజమని, ఫెయిల్ అయిన విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని తెలిపారు. పాస్ అయినా, ఫెయిల్ అయినా ఎవ్వరూ అధైర్యపడకూడదన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులను తల్లిదండ్రులు ఓదార్చి ప్రోత్సహించాలని సూచించారు. సప్లిమెంటరీ పరీక్షల ద్వారా మళ్లీ అవకాశం ఉంటుందని గుర్తుచేశారు.
Tags: Do Not Lose Heart If You Fail: SP Dheeraj’s Advice