అమరావతిముచ్చట్లు:
▪️రూ.44వేల నుండి రూ.55, వేలకు పెంచుతూ సీఎం నిర్ణయం.
▪️జిల్లా కోర్టుల్లో జీపీలు, ఏజీపీలకు కూడా పెంచే ప్రతిపాదన
▪️రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి.
రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టులో పనిచేస్తున్న ఏజీపీల (అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లు) గౌరవ వేతనాన్ని 25 శాతం పెంచుతూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు. హైకోర్టు ఏజీపీలకు ప్రస్తుతం ఇస్తున్న వేతనం మొత్తం రూ.44 వేల నుండి రూ.55 వేలకు పెంచుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వీరితోపాటు జిల్లా కోర్టుల్లో పనిచేస్తున్న జీపీలు, ఏజీపీలకు కూడా వేతనాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు పంపవలసిందిగా సీఎం ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.
Tags: High Court AGPs’ honorarium hiked by 25 percent