తిరుపతి ముచ్చట్లు:
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.
సాయంత్రం 6 నుండి 7.30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు.
ఏప్రిల్ 30 నుండి మే 2 వరకు వసంతోత్సవాలు జరుగనున్నాయి. భక్తులు రూ.150 చెల్లించి ఈ ఉత్సవాల్లో పాల్గొనవచ్చు.
మే 1న ఉదయం 9.30 గంటలకు స్వర్ణ రథోత్సవం జరుగుతుంది. మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7.30 నుండి 8.30 వరకు అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా విహరిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, అర్చకులు బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Tags: Ankurarpana for the Vasanthotsavams of Goddess Sri Padmavathi