April 29, 2026
Explore
అయ్యా…. సారూ….

అయ్యా…. సారూ….

April 29, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

మా అక్క సచ్చిపోయింది
మా అక్కకు మీ బ్యాంకులో ఖాతా ఉన్నది
అ ఖాతాలో ఓ పంతొమ్మిదివేల పదహారు రూపాలున్నాయి
ఇస్తారా సార్,

మా అక్కకి నేను
నాకు మా అక్క తప్పా
మాకు ఇంకెవలూ లేరు సార్,
మా అక్క సచ్చిపోయింది
కొంచం ఆ ఖాతాలో ఉన్న పైసలిస్తారా సార్
మీకు పుణ్యముంటది,

“కుదరదు కుదరదు
మీ అక్కకి నామినీ లేదు
మీ అక్క పైసలు నీకివ్వడం కుదరదు
బయటికిపో….. పో…పో…
హే సెక్యూరుటీ….. “

రోజులు గడిచాయి
నెలలు గడిచాయి
ఆ తమ్ముడి చెప్పులేని కాళ్లు
ఆ తమ్ముడి అచేతనమైన చేతులు
తన అక్క ఆస్థికలని బ్యాంకు వరండా మీదికొచ్చాయి,

ఈ అస్థ వ్యస్థ వ్యవస్థమీద
ఆ అక్క ఆస్థికలు సంతకం చేసాయి…

నీరవ్ మోదీలకు,విజయ్ మాల్యాలకు వర్తించని
ఈ వ్యవస్థ విధానాలు
యముకల గుళ్లమీద,నిరుపేద ఆస్థికలమీద అమలుచేయబడుతుంటాయి…

Tags: Sir…